ఉప్పల్, నవంబర్ 4 : ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిలుకానగర్, నాచారం డివిజన్లలో బీఆర్ఎస్ నేతలు శనివారం పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేపట్టారు. చిలుకానగర్‌లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ, మ్యానిఫెస్టో కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ప్లకార్డులతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సాయి రాంనగర్, ధర్మపురికాలనీ, కళ్యాణపురి, తదితర ప్రాంతాల్లో ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచి, కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో..
రామంతాపూర్, నవంబర్ 4 : ఉప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మ రింత అభివృద్ధి సాధిస్తుందని మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు అన్నారు. శనివారం రామంతాపూర్ నెహ్రూనగర్ కాలనీలో గడప, గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచా రం చేశారు. బండారి భారీ మెజార్టీ తో గెలువడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, తూటి నర్సింహ, శ్రీనివాస్‌రెడ్డి, వనంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఆలె రమేశ్, మనీశ్, ఫయాజ్, కృష్ణ, అజయ్‌కుమా ర్, రాజు, శ్రీకాంత్, చందు, మంజు ల, స్వప్నా, సబిత, సంధ్య, వెంకటరమణ, శివ, తదితరులు పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్లో
హబ్సిగూడ డివిజన్ పరిధిలోని పాశం సత్తయ్య కాలనీలలో ఇంటింటా బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈకార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో..
రామంతాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిప్పని సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో సైదులు, సంతోష్, సుభాష్, శ్రీనివాస్, బాలాకుమార్, తదితరులు పాల్గొన్నారు. అలాగే.. రాజేంద్రనగర్‌లో ఎస్సీ సెల్ నాయకులు పోకల నవీన్‌కుమార్, సీమ అశోక్‌లు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఓటర్లకు వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్లో..
చర్లపల్లి, నవంబర్ 4 : ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ, జీఆర్‌రెడ్డి కాలనీ, జైజవాన్ కాలనీ, బీజేఆర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు ప్రచారంను ము మ్మరం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రచారం చేపట్టడంతో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, నాయకులు తిరుపతయ్య, మురళీపంతులు, గోలి శ్రీనివాస్, నాగేశ్వర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రహీం, దుర్గా, కృష్ణ, బసవయ్య, గోవర్దన్, రాజిరెడ్డి, యాకయ్య, సింగం రాజుతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్లో..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రచారంను ము మ్మ రం చేస్తున్నామని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని వీఎన్‌రెడ్డినగర్, మహాలక్ష్మినగర్, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు డివిజన్లో ప్రచారంను ముమ్మరం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, గిరిబాబు, సారా అనిల్, కొల నరేశ్, కడియాల యాదగిరి, లక్ష్మారెడ్డి, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ఆనంద్రాజుగౌడ్, రెడ్డినాయక్, చంద్రమౌళి, సుభాష్, మురళి, పాండు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్‌నర్సింహా, నవనీత, సత్తెమ్మ, లలిత, సోమయ్య, ముత్యాలు, రాధకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్లో..
మల్లాపూర్, నవంబర్ 4 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపే ధ్యేయంగా మల్లాపూర్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం డివిజన్ పరిధిలోని మోడీ అపార్ట్మెంట్స్, అన్నపూర్ణ కాలనీ, లింగమయ్యనగర్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాలనీల్లో డప్పు చప్పుళ్లతో పాదయాత్ర చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ముమ్ముర ప్రచారం చేపట్టారు. అనంతరం స్థానిక యువకులు నీరజ్, శివ, తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.