ఉప్పల్, నవంబర్ 7 : మోసపూరితహామీలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఓటును అభ్యర్థించారు.
రవీంద్రనగర్కాలనీ కెప్టెన్ వీరరాజారెడ్డి పార్కులో వాకర్స్‌ను, యోగ, మెడిటేషన్ చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు. అదేవిధంగా నాచారంలో పాదయాత్ర చేపట్టారు. నాచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతిసాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈమేరకు ఇం టింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. వాహనదారు లు, మహిళలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కో రారు. కార్యక్రమంలో నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్లో..
కాప్రా, నవంబర్ 7: కాప్రా డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు బృందాలుగా విడిపోయి ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని, బీఎల్ఆర్ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. మహి ళా నేతలు గృహిణిలను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గాంధీనగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్నాయకుడు మహేష్, కొప్పులకుమా ర్, ఇంద్రయ్య, రాజేష్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారానికి స్పందన..
చర్లపల్లి, నవంబర్ 7 : చర్లపల్లి డివిజన్లో చేపడుతు న్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్థానికులు, కాలనీవాసులు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్, కృష్ణానగర్, వెంకట్‌రెడ్డినగర్, అయ్యప్ప కాలనీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో చేపడుతున్న ప్రచారంకు అన్ని వర్గాల నుంచి అపూ ర్వ స్పందన వస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మె జారిటీ అందించేందుకు డివిజన్లో ప్రచారంను ముమ్మ రం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, చల్లా వెంకటేశ్, సారి అనిల్, కడియా ల యాదగిరి, లక్ష్మారెడ్డి, కొమ్ము సురేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము రమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రమౌళి, ఆనంద్రాజుగౌడ్, మురళి, పాండు, సోమయ్య, ముత్యాలు, రవి, బాల్‌రాజు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలిత, రాధకృష్ణలతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం..
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఏఎస్‌రావునగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం ఏఎస్‌రావునగర్ డివిజన్ భావనరుషి పద్మశాలి టౌన్షిప్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా నాయకులతో కలిసి వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ అందించేందుకు ప్రచారంను ముమ్మరం చేస్తున్నామని, ఎన్నికల మ్యానిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రచారం చేస్తుండటంతో స్థానికులు పార్టీకి మ ద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు.
ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ అం దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, నాయకులు శేర్ మణెమ్మ, బేతాల బాల్‌రాజు, పెంచల సురేందర్‌రావు, మురళిపంతులు, గోలి శ్రీనివాస్, కందాడి సుదర్శన్‌రెడ్డి, కందుల లక్ష్మీనారాయణ, బాల్‌నర్సింహా, శోభారాణి, దుర్గా, శిరీషారెడ్డి, రజిత, రామతులసీ, నాగేశ్వర్‌రెడ్డి, బసవయ్య, మహ్మద్ బాజీబాషా, కృష్ణ, సురేందర్‌చారి, గడ్డం శ్రీను, సింగం రాజు, గోవర్దన్, సత్తెమ్మ, యాకయ్య, సిం గారపు రాజు, మట్ట గిరి, మొగులయ్య, సాయిరెడ్డి, నితిన్, దాసు, సూర్య నారాయణ, రమేశ్‌చారి, భాస్కర్, హరినాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.