HRC | హెచ్ఆర్సీ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం.. కీలక విషయాలు వెలుగులోకి!
HRC | హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
HRC | హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం కేసులో తనను తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టారని, తాను పనిచేసే అపార్ట్మెంట్లో పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే.. కవాడిగూడకు చెందిన శ్రావణి అదే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆమె నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని కవాడిగూడకు చెందిన శ్రావణి ఆత్మహత్యకు యత్నించింది. . కమిషన్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే తేరుకొని బాధితురాలు శ్రావణిని అడ్డుకొని ఆమె చేతిలోని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. సదరు మహిళను కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకువెళ్లారు.
కవాడిగూడలోని ఓ అపార్ట్మెంటులో ఐదేళ్లుగా పనిచేన్నానని శ్రావణి తెలిపింది. ఇటీవల బంగారం దొంగతనం జరిగిందని అపార్ట్మెంట్ యజమాని ఇందిరా ప్రియదర్శిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపింది. అయితే పోలీసులు ఆ దొంగతనం కేసులో తనను అనుమానితురాలిగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని పేర్కొంది. అక్కడ తనను విచక్షణారహితంగా కొట్టారని.. దొంగతనం చేసిందని అపార్ట్మెంట్ అంతా తన ఫొటోలను పోస్టుర్లుగా అంటించారని వాపోయింది. ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది.
పోలీసులు నన్ను విచక్షణారహితంగా కొట్టారు
నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో అప్డేట్
కవాడిగూడ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో ఐదేళ్లుగా పనిచేస్తున్నానని, ఇటీవల బంగారం దొంగలింపబడిందని అపార్ట్మెంట్ ఓనర్ ఇందిరా ప్రియదర్శిని, గాంధీనగర్ పోలీసులకు… https://t.co/Acdu3ESqCl pic.twitter.com/VFc5z2dv6x
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
ఈ ఆరోపణలపై మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. దీనిపై సవివరమైన నివేదిక సమర్పించాలని నగర పోలీస్ కమిషన్‌కు సిఫారసు చేసింది. ఈ నెల 30వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

