సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 20 సర్కిళ్లలో అంటే గ్రేటర్‌లోని పదిసర్కిళ్లు కలుపుకొని ఒక్కరాత్రిలోనే 8,190 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్‌లో 1370 ఫిర్యాదులు రాగా, రాజేంద్రనగర్‌లో 1275, సె్ంరట్రల్లో 1055, సౌత్ సర్కిల్లో 846, సికింద్రాబాద్‌లో 1107, సంగారెడ్డిలో 632, బంజారాహిల్స్‌లో 448, సరూర్‌నగర్‌లో 235, హబ్సిగూడలో 225 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం ఎక్స్ ద్వారా 64, 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా 3980, యాప్ ద్వారా 2788, వెబ్ నుంచి 145, వాట్సప్చాట్బాట్ ద్వారా 103 ఫిర్యాదులు మొత్తం 7080 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీడీసీఎల్ గ్రీవెన్స్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పందిస్తూ అకాల వర్షం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని, అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది చురుకుగా పనిచేయడం వల్ల చాలాచోట్ల అరగంటలోపే సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పారు.