Suicide | జగద్గిరిగుట్ట, మార్చి 8: జగద్గిరిగుట్టలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు స్థానికుల వివరాల మేరకు.. జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వాటర్ ట్యాంక్ పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి (45)కిందకు దూకాడు. స్థానికులు గమనించేసరికి తీవ్ర గాయాలతో అతను చనిపోయాడు.
గోధుమ రంగు షర్ట్, చాక్లెట్ కలర్ ప్యాంట్ ధరించడంతోపాటు ఒంటిపై జంధ్యం వేసుకున్నాడు . షర్ట్‌పై ఉన్నలోగో ను బట్టి ఏదో కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని గుర్తించినవారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ని సంప్రదించాలని కోరారు. కాగా పదిరోజుల క్రితం కూడా ఇదే వాటర్ ట్యాంకు పైనుంచి దూకుతానని మహిళ హల్ చల్ చేయగా పోలీసులు రక్షించారు. ఎవరు ఎక్కకుండా ట్యాంక్ వద్ద నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.