అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో స్పేస్ సూట్ ధరించి యువతి దిగిన చిత్రమిది. 150 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు ఈ నెల 14 వరకు కొనసాగనున్నది.
ఆహా అనిపించే రాకెట్లు.. విస్మయపరిచే శాటిలైట్లు.. అంతరిక్షంలో వాడే స్పేస్ సూట్లు ఇవన్నీ చూడాలంటే ఏ స్పేస్ సెంటర్‌కో వెళ్లాలి. కానీ.. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో ఇవన్నీ కనువిందు చేస్తున్నాయి. మంగళవారం ఈ సదస్సును సందర్శించిన విద్యార్థులు వాటి వద్ద ఫొటోలు దిగి సందడి చేశారు.