సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాక సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్ ఆదేశాలు జారీచేశారు. నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
హైదరాబాద్ నుంచి మోయినాబాద్, చేవెళ్ల మీదుగా వికారాబాద్ వెల్లే వాహనాలను రోటరీ-1 టీఎస్పీఏ వద్ద దారిమళ్లించి, సర్వీసురోడ్డు మీదుగా నర్సింగి, జన్వాడ-శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్ నుంచి వికారాబాద్ వైపునకు అనుమతిస్తారు.
రాజేంద్రనగర్, శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18వైపు వచ్చే వాహనాలను ఒకటవ నెంబర్ ఎగ్జిట్ నుంచి దారిమళ్లించి, సర్వీసు రోడ్డు మీదుగా మూవీ టవర్స్ న్యూ రోడ్, సీబీఐటి జంక్షన్, శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
టీఎస్పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వెళ్లే వాహనాలను హిమాయత్‌సాగర్ ఎక్స్‌రోడ్, ప్రగతి రిసార్ట్స్, ఎంకపల్లి ఎక్స్‌రోడ్, ఆలూరు ఎక్స్‌రోడ్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
టీఎస్పీఏ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద దారిమళ్లించి ప్రగతి రిసార్ట్స్, ఎంకపల్లి ఎక్స్‌రోడ్ మీదుగా శంకర్పల్లి వైపు అనుమతిస్తారు.
వికారాబాద్ నుంచి మొయినాబాద్, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆలూరు ఎక్స్‌రోడ్ వద్ద దారిమళ్లించి, ఎంకపల్లి ఎక్స్‌రోడ్, ప్రగతి రిసార్ట్స్, హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్, ఎన్‌హెచ్-163 మీదుగా అనుమతిస్తారు. లేదా వికారాబాద్ నుంచి మొయినాబాద్ , హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆలూరు ఎక్స్‌రోడ్ వాద్ద దారిమళ్లించి ఆలూరు, పర్వేద ఎక్స్‌రోడ్, శంకర్పల్లి, నార్సింగి మీదుగా దారిమళ్లిస్తారు.
వికారాబాద్ నుంచి షాబాద్, షాద్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను బస్తపూర్ ఎక్స్‌రోడ్ వద్ద దారిమళ్లించి పమేనా, పమేనా ఎక్స్‌రోడ్స్, నగర్గూడ ఎక్స్‌రోడ్ మీదుగా షాబాద్ వైపు అనుమతిస్తారు.
షాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్లే వాహనాలను పమేన ఎక్స్‌రోడ్, పమేన, బస్తేపూర్, ఎన్‌హెచ్-163 మీదుగా అనుమతిస్తారు.
మొయినాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్లే వాహనాలను షాబాద్ ఎక్స్‌రోడ్ వద్ద దారిమళ్లించి పమెన ఎక్స్‌రోడ్, పమేన, బస్తేపూర్, ఎన్‌హెచ్163 మీదుగా వికారాబాద్‌కు అనుమతిస్తారు. పై ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలను ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని జాయింట్ సీపీ (ట్రాఫిక్) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.