సిటీబ్యూరో: వన్‌టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ్మి రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు. సైనిక్పురికాలనీకి చెందిన సదరు బాధితుడు ఓ వీడియోను చూసి లింక్ క్లిక్ చేశాడు. అకౌంట్ క్రియేట్ చేసుకోవడంతోనే సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. దఫ దఫాలుగా రూ. 31.93 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.