కాచిగూడ,ఆగస్టు 31 : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(45)మంగళవారం యాకత్‌పుర-డబీర్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుcr ఒంటిపై తెలుపు రంగు ఫుల్చొక్క, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8143807592లో సంప్రదించాలని కోరారు.