ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్‌నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెగా డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా తెలుపుతున్న జేఏసీ నేతలు.. శంకర్‌నాయక్, రవికుమార్, కరుణాకర్, సింధూరెడ్డి, వీరేష్, శ్రీకాంత్, ప్రసన్న, దివ్య తదితరులను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పీఎస్‌కు తరలించారు.
– ముషీరాబాద్, జూన్ 22