భార్య మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గత కొన్నిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
- అనాథలైన ఇద్దరు చిన్నారులు
బంజారాహిల్స్, ఫిబ్రవరి 28 : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గత కొన్నిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్‌లో నివాసముంటున్న ఎస్.భరత్‌కుమార్(34) బీహెచ్ఈఎల్ ఆర్డీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట మమతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి బాబు(6), పాప(3) ఉన్నారు. కాగా గత నెల 31న ఓ ఫంక్షన్‌కు భార్యాపిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లముందే తన భార్య దుర్మరణం చెందిన విషయాన్ని జీర్ణించుకోలేని భరత్ కుమార్ అప్పటినుంచి డిప్రెషన్లోకి వెళ్లాడు. మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రమేశ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో నెలరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

