Hyderabad | చిక్కడపల్లి, ఆగస్టు3 : నిరుద్యోగులు ఎలాంటి ధర్నాలు, నిరసనలకు పిలుపునివ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిర్భంధించారు. పలువురు నిరుద్యోగులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషేన్కు తరలించారు. నిరుద్యోగులు రవి రాథోడ్, విశాల్, నితీష్, నవీన్, అమర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడు రవి రాథోడ్ మాట్లాడుతూ.. ఎలాంటి ధర్నాలకు, నిరసనలకు పిలుపునివ్వకపోయినా.. చిక్కడపల్లి ,అశోక్ నగర్ ప్రాంతాల్లో మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఒక ససంవత్సరం కావడంతో శనివారం గాంధీగనర్లో పిండ ప్రదానం కార్యక్రమాన్ని చేశారు. దీంతో ప్రభుత్వం అక్కసుతో పోలీసుచేత నిరుద్యోలను అక్రమంగా అరెస్టు చేయించిందని మండిపడ్డారు. 2024 ఆగస్టు 2న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని అదే రోజు అసెంబ్లీలో కనుమరుగైందని విమర్శించారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 60వేల ఉద్యోగాలు భార్తీ చేశామని ప్రతీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారనని మండిపడ్డారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. ఎలాంటి లిటికేషన్ లేకుండా యూపీఎస్సీ తరహాల్లో నోటిఫికేషన్ విడుల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. నోటిఫికేషన్ విడుల చేయని పక్షంలో స్థానిక సంస్థలో ఎన్నికల్లో పోటీ చేస్తామని, కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతామని హెచ్చరించారు.