మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయ అర్చక వైదిక స్మార్త రావికోటి పార్థివశర్మకు పురస్కారం అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చిత్రంలో మంత్రి మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు
రవీంద్రభారతిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనం అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సత్కరిస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కవులు, రచయితలు అమ్మంగి వేణుగోపాల్, జూపాక సుభద్ర తదితరులు
సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి : రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్లు, జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక వేత్తలకు మొత్తం 34 మందికి పురస్కారాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసి ఘనంగా సత్కరించారు. సాయం త్రం నిర్వహించిన కవి సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కవులు, కళాకారులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, భాను ప్రకాశ్, ఎమ్మెల్యేలు కాలేరు యాదయ్య, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, రసమయి బాలకిషన్, గండ్ర వెంకటరమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,బీసీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కవులు అమ్మంగి వేణుగోపాల్, సిద్ధార్థ, రామాచంద్రమౌళి, వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్, నెల్లుట్ల రమాదేవి, జూపాక సుభద్ర, ఐనంపూడి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
రవీంద్రభారతి ఆవరణలో సాంస్కృతిక ప్రదర్శనలు