బేగంపేట్ / బన్సీలాల్పేట మార్చి 26: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్ పేట కు చెందిన ప్రణయ్(19) అక్షయ్ (21) జీహెచ్ఎంసీ పెస్ట్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్నారు.
ఇద్దరూ కలిసి స్పోరట్స్ బైక్ పై ఉదయం 5 గంటల ప్రాంతంలో మహంకాళి పీఎస్ పరిధిలోని సరోజినీ దేవీ రోడ్ లో, మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద బైక్ పై అతివేగంగా వెళుతూ ఓ కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో సీసీ నగర్ కు చెందిన ప్రణయ్ అక్కడికక్కడే చనిపోగా, అక్షిత్ .. దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించాడు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.