Current Shock | హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని తెలిసిందే. నగరంలోని చాంద్రాయణ, పాతబస్తీ, రాయ్‌దుర్గ్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, మియాపూర్, ముషీరాబాద్, లక్డీకాపూర్, సరూర్ నగర్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడతోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సిటీలో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులకు కరెంట్ తీగలు రోడ్డుపై పడ్డాయి. ఆటోలో నుంచి దిగిన ఇద్దరు యువకులు కరెంట్ వైర్లను చూసుకోకపోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను చాంద్రాయణ గుట్టకు చెందిన జాఫర్ , అబూగా గుర్తించారు.
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు