సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): నేరాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే రౌడీషీటర్లపై రాచకొండ పోలీసులు బహిష్కరణ వేటు వేస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మైండ్‌సెట్ మార్చు కోవాలంటూ సూచనలు చేస్తూ వస్తున్నారు. అందులో కొందరు తమ ప్రవర్తనను మార్చుకుంటూ నేరాలకు దూరంగా ఉంటుండగా మరికొందరు మాత్రం నేరాలే తమ వృత్తిగా రెచ్చిపోతున్నారు. అలాంటి వారిని గుర్తించి నగర బహిష్కరణ చేస్తున్నారు.
సాధారణంగా శివారులలో రౌడీషీటర్లు తక్కువగా ఉంటారు, రౌడీషీట్లు నమోదైన వారు చాల మంది అణిగిమనిగి ఉంటారు. రౌడీషీట్ నమోదైతే పోలీసుల నిఘా నిరంతరం తమపై ఉంటుందని, తమ ప్రాంతంలో ఏ గొడవ జరిగినా, పండుగలు, ముఖ్య సమావే శాలు ఇలా ఏదీ ఉన్నా ముందుగా తమనే ఠాణాకు పోలీసు లకు పిలుస్తారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే నేరాలకు దూరంగా ఉంటూ తమపై పడ్డ రౌడీషీట్లను మంచి ప్రవర్తన తో తొలగించుకునేందుకు చాల మంది తమ వంతు కృషి చేస్తుంటారు.
ఓల్డ్‌సిటీ వాతావారణంతో సంబంధాలున్న పహాడీషీర్, బాలాపూర్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలలో కొందరు రౌడీషీటర్లు భయం లేకుండా ప్రజలను ఆం దోళనకు గురిచేస్తుంటారు. ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టి వారి ఆగడాలను ఆటకట్టిస్తున్నారు. ఎక్కువగా కేసులు నమోదైన రౌడీషీటర్ల చిట్టాను తీస్తున్నారు. పలుమార్లుజైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు కన్పించకపోవడంతో అలాంటి వారిని నగరానికి దూరంగా ఉంచాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు నిర్ణయం తీసుకు న్నారు.
అలాంటి వారిపై సెక్షన్ 261 సిటీ పోలీస్ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు. ఇటీవల ఇద్దరు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటూ రౌడీలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రవర్తన మార్చుకోని రౌషీటర్లపై నిరంతరం నిఘా పెడుతూ వారిని కట్టడి చేస్తున్నారు. నేరాలు చేసే వారికి రాచకొండ పరిధిలో తావు లేకుండా చేసేందుకు అన్ని విభాగల పోలీసులు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు ఏమి చేస్తున్నారు, వారి రోజు వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు.
పదుల సంఖ్యలో కేసులు..!
ఇటీవల ఇద్దరు రౌడీషీటర్లను రాచకొండ సీపీ సుధీర్‌బా బు నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రాజేష్ అలియాస్ మెంట్ రాజేష్‌పై 19 కేసులు ఉన్నాయి. ఇందులో 4 హత్య కే సులు కూడా ఉన్నాయి, అలాగే సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మెహీన్పై 21 కేసులు ఉన్నాయి, ఇతనిపై కూడా పలు హత్య కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, హత్యలు, హత్య యత్నా లు, దాడులకు సంబంధించిన పలు కేసులలో ఈ రౌడీషీట ర్లు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు.
అయితే జైలుకు వెళ్లి వచ్చిన తరువాత మరో నేరం చేయకుండా ఉంటూ తమ నేర ప్రవర్తిని మార్చుకునేందుకు చాల మంది నేరస్తులు ప్రయత్నిస్తుంటారు. కాని అందుకు భిన్నంగా ఈ ఇద్దరు రౌడీషీటర్లు నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తమ ప్రవర్తన ను మార్చుకోకుండా, మరిన్ని నేరాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయడంతో ఇద్దరు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేశారు.