మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Aug 02, 2020 , 00:47:31

రెండు గంటలు.. ఏకధాటిగా వాన.. జలమయమైన రహదారులు

రెండు గంటలు.. ఏకధాటిగా వాన.. జలమయమైన రహదారులు

ట్రాఫిక్‌కు అంతరాయం.. స్తంభించిన జనజీవనం.. 

లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు  నీరు 

కూకట్‌పల్లిలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం.. 

పరిస్థితిని చక్కదిద్దిన మాన్‌సూన్‌ టీమ్స్‌ 

చినుకులా మొదలై.. కుండపోత కురిసింది.. నగరం తడిసిముైద్దెంది. శనివారం రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. రహదారులపై వరద ముంచెత్తడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.  వెంటనే రంగంలోకి దిగిన బల్దియా మాన్‌సూన్‌ బృందాలు.. నిల్వ నీటిని వెనువెంటనే తరలించే ఏర్పాట్లు చేశాయి. పరిస్థితిని చక్కదిద్దాయి.  ట్రాఫిక్‌ పోలీసులూ సేవలందించారు. కాగా, కూకట్‌పల్లి మండలం, కేపీహెచ్‌బీ, సీబీసీఐడీ కాలనీలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్లు, చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో అత్యల్పంగా 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, ఖైరతాబాద్‌, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, సైదాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, షేక్‌పేట, పటాన్‌చెరు, మారేడ్‌పల్లి, కాప్రా, ముషీరాబాద్‌, ఆసిఫ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  పలు కాలనీలు, వీధులు చెరువులను తలపించాయి. రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


logo