Osman Sagar | మణికొండ, ఆగస్టు 20 : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఒక ఫీట్ మేర ఎత్తి మూసీలోకి నీటిని వదదిలారు. గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ మొత్తం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1789 ఫీట్లకు చేరుకుంది.
వెంటనే స్పందించిన అధికారులు గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి వదిలారు. కాగా హిమాయత్‌సాగర్ జలాశయం ముందస్తుగా నీటి మట్టానికి చేరుకోవడంతో గత కొన్ని రోజులుగా గేట్లను ఎత్తి నీటిని ఈసీ నదిలోకి వదులుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సంవత్సరంలో మొదటిసారిగా ఉస్మాన్‌సాగర్ గేట్లు బుధవారం ఎత్తి మూసీలోకి 1600 క్యూసెక్కుల నీటిని వదిలారు.
అధికారుల అప్రమత్తం…
జంట జలాశల నీటిని మూసీ నదిలోకి వదలడంతో మూసీ, ఈసీ నదుల పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ నది వైపు ఎవరు వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టారు.