హైదరాబాద్ : వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలను ఎయిర్స్‌లైన్స్ అధికారులు ఇతర నగరాలకు దారి మళ్లించారు. పుణె నుంచి రావాల్సిన ఇండిగో ఫ్లైట్‌ను ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయించారు.
అలాగే దుబాయి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఇంటర్నేషనల్ సర్వీస్ ఎమిరేట్స్ విమానాన్ని బెంగళూరు విమనాశ్రయంలో ల్యాండింగ్ చేయించారు. వెదర్ సపోర్ట్ చేయడంతో కొద్దిసేపటి క్రితమే సదరు రెండు విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాయి.