హైదరాబాద్: హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ ఫ్లైఓవర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దీంతో ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు యువకులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై బైకు అదుపుతప్పడంతో కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకులు ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.