హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని బాబుల్‌రెడ్డి నగర్లో(Babul Reddy Nagar) విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ప్రహరీ గోడ కూలి(Wall collapsed) బాలిక 8(నూర్జహాన్), బాలుడు 3(ఆసిఫ్ పర్వీన్) మృతి(Children died) చెందగా.. మరో ఇద్దకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే చికిత్స కోసం క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.