సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. వివరాల్లోకి వెళ్తే….ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్, ధనుంజయ్‌లు.. మరికొందరితో కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు.
ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ , తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇందులో భా గంగా ఒడిశా నుంచి రైలు మార్గంలో ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో మనోజ్, ధనుంజయ్‌ల వద్ద రూ.3.75లక్షల విలువ చేసే 15కిలోల గంజాయి లభించింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేసి, గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు.