బేగంపేట్, ఆగస్టు 12:తూర్పున పిలిప్పీన్ నుంచి పడమర టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధ పడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆస్పత్రిగా ‘కిమ్స్’ చారిత్రాత్మక మైలు రాయిని సాధించిం ది. ఈ చికిత్సనే డే కేర్ విధానంలో నిర్వహించారు.
ఇప్పటి వరకు బహెరాన్, దుబాయ్, మారిషస్లకు చెందిన ముగ్గురు విదేశీయులు సహా 13 మంది రోగులకు విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా భారత వైద్య రం గంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతి వైద్య నైపుణ్య ప్రాముఖ్యతను కిమ్స్ ఆసుపత్రి మరోసారి నిరూపించింది. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈ అత్యాధునిక వైద్య పరికరాలను కిమ్స్ ఆసుపత్రుల సీఎండీ డాక్టర్ భాస్కర్రావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…తుల్సా ప్రోతో ఇప్పు డు మేము ప్రోస్టేట్ చికిత్సలో సంపూర్ణ సేవలు అందిస్తామన్నారు. అనంతరం అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న రోగులకు అందించే వైద్య నైపుణ్యం సేవలపై కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు వివరించారు.
కిమ్స్ కన్సల్టెంట్ యురాలజిస్ట్ యూరో అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ లిఖితేశ్వర్ పల్లగాని మాట్లాడుతూ..తుల్సా ప్రోను లైంగిక సామర్ధ్యాన్ని కాపాడే కచ్చితమైన ఎంఆర్ఐ మార్గదర్శక రోబోటిక్ విధానం ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగుల్లో ఇది తరుచూ ముఖ్యమైన ఆందోళనగా కనిపిస్తుందన్నారు. ఈ పరికరాన్ని మూత్ర నాళం ద్వారా ప్రవేశపెట్టి ప్రోస్టేట్ కణజాలాన్ని లోపల నుంచే తొలగిస్తారని, అదే రోజు రోగులు డిశ్చార్జ్ కావచ్చునని చెప్పారు. కార్యక్రమంలో యూరాలజీ శస్త్రచికిత్స వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.