TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ మరో కొత్త పథకం తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు( RTC Offers ) ప్రకటించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట కొత్త ఆఫర్లను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్( VC Sajjanar ) ఆవిష్కరించారు.
మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 300 చెల్లించి ఎఫ్-24 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆ టికెట్‌పై నలుగురు వ్యక్తులు రోజంతా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు టికెట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ‘ఎఫ్-24’ టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023