హైదరాబాద్: బేగంపేటలో (Begumpet) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం బేగంపేట బస్ స్టాప్ వద్ద థార్ జీపుని వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో థార్ వాహనం వెనుక భాగం నుజ్జు నుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
