బడంగ్పేట్/ఆర్కేపురం, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ మాట్లాడుతూ.. పేద వర్గాలకు వరాల జల్లులాంటి మ్యానిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో విపక్ష పార్టీల వెన్నులో వణుకు మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, ముప్పిడి లింగస్వామిగౌడ్, కొండ్ర శ్రీనివాస్, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, వల్లూరి రమేశ్, కంచర్ల శేఖర్, ముచింతల జగన్, వాజీద్ పటేల్, గిరినంధన్గౌడ్, అనురాధ, పొద్దుటూరి శ్రీనివాస్‌గుప్తా, అల్లావుద్దీన్పటేల్ తదితరులు ఉన్నారు.
సరూర్‌నగర్ డివిజన్లో..
సరూర్‌నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి మెనిఫెస్టోతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరిగేవిధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ ముదిరాజ్, తాటికొండ రాఘవేంద్రగుప్తా, లక్ష్మణ్, నాగేశ్, కిశోర్, కందుల రాము, నాగమణి, సుధా, శశికల, భాగ్య తదితరులు ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు గుబులు
రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించారని మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేశ్‌రెడ్డి అన్నారు. మీర్పేట్ స్వాగత్‌గ్రాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు పెద్దపీట వేస్తూ ఆసరా పింఛన్లు, 400 రూపాయలకే వంట గ్యాస్, వికలాంగులకు రూ.4వేల నుంచి రూ.5వేల పింఛన్లు, రూ.15లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు గుబులు మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దల అండాలుఅంజయ్య, పద్యరెడ్డి, మాధవి, అనిల్, సుదర్శన్, హామునాయక్, దయానంద్ ముదిరాజ్, గోపియాదవ్, సుమలత, శేఖర్, యాదగిరిరెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మణ్, అవినాశ్, నర్సింహ, రామకృష్ణ, నాటిశివ తదితరులు పాల్గొన్నారు.