ఎల్బీనగర్ : నగరంలో విషాదం నెలకొంది. కూలి పని కోసం వచ్చిన ముగ్గురు కూలీలు పనిచేస్తుండగా మట్టి దిబ్బలు మీదపడి దుర్మరణం చెందారు. ఎల్బీనగర్లో ఓ హోటల్ నిర్మాణంలో భాగంగా సెల్లార్లో (Cellar) బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.
దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు మొదలు పెట్టాయి. మట్టిదిబ్బల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.