పోచారం,మే 14: నగరంలో సందడి చేస్తున్న అందాల భామలు బుధవారం వరంగల్ సందర్శనకు వెళ్లిన సందర్భంగా వరంగల్ జాతీయ రహదారి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వద్ద దాదాపు 45 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ప్రత్యేక మూడు బస్సుల్లో ఔటర్ నుంచి వచ్చి అన్నోజిగూడ ఎగ్జిట్ వద్ద దిగి.. వరంగల్ వైపు వెళ్లారు. దీంతో అప్పటికే అరగంట ముందు పోలీసులు జాతీయ రహదారి, రహదారిపైకి వచ్చే అన్ని రోడ్లను దిగ్బంధం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఎర్రని ఎండలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.