Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్రపతి నగర సందర్శన నేపథ్యంలో నగరలోని పలు చోట్ల శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) జోయల్ డెవిస్ తెలిపారు. రాష్ట్రపతి నిలయం, రాజ్‌భవన్‌కు వీఐపీల రాకపోకల తాకిడి నేపథ్యంలో ముఖ్యంగా సికింద్రాబాద్, తిరుమల్గిరి, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 6.45 గంటల వరకు సీటీఓ, రసూల్‌పురా, పిఎన్టి జంక్షన్, హెచ్‌పిఎస్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ కత్రియ హోటల్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వివి స్టాచ్యు, రాజ్‌భవన్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు.
ఈనెల 22న ఉదయం 8.30గంటల నుంచి రాత్రి 9.30వరకు రాజ్‌భవన్, వివి స్టాచ్యు, మెట్రొ రెసిడెన్సీ, రాజ్‌భవన్, కత్రియ హోటల్, యశోద హాస్పిటల్, మొనప్ప జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, హెచ్‌పిఎస్, పిఎన్టి జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ సీపీ వెల్లడించారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని ఆయన సూచించారు.