Traffic Restrictions | సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో వచ్చే నెల 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చేవారు ఆర్టీసీ, మెట్రో రైలు సర్వీస్‌లను వాడుకోవాలని, రాత్రి 11.30 గంటల వరకు, వారంతం, సెలవు రోజుల్లో 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎగ్జిబిషన్‌కు వచ్చేవారు రోడ్లు క్రాష్ చేయవద్దని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశాలుంటాయని, గాంధీభవన్ వద్ద ఉన్న మెట్రో బ్రిడ్జిని వాడుకొని రోడ్డు క్రాస్ చేయాలని సూచించారు.