Traffic Restrictions | రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..! పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు.
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి ముర్ము చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్కుంట ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదని చెప్పారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
బొల్లారం, అల్వాల్, లోత్కుంట, త్రిముల్ఘేరి, కార్ఖానా, జేబీఎస్, ప్లాజా జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్ రూట్లలో వచ్చే వాహనాలను రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లించనున్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్‌పీఎస్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

