సైబరాబాద్ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Cyberabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వెహికల్స్ డైవర్షన్స్ ఇలా..
-షాద్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. 30న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్‌ను ఒకే లేన్‌లో అనుమతిస్తారు. మరో లేన్‌లో వచ్చే వెహికల్స్ అమిత్కాటన్ మిల్, బూర్గుల క్రాస్‌రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్‌కు వెళ్లాలి.
-బెంగళూరు నుంచి షాద్‌నగర్‌వైపు వచ్చే వాహనాలు కేశంపేట క్రాస్ రోడ్, చటాన్‌పల్లి రైల్వే గేట్‌మీదుగా వెళ్లాలి.
-పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలు షాద్‌నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది.
31న ఇలా…
-సిటీ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లే వాహనాలు కొత్తూరు వై జంక్షన్, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
-జడ్చర్ల నుంచి షాద్‌నగర్ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికల్స్ వన్‌వేలో వెళ్లాల్సి ఉంటుంది.
-శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. 31న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు… బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలను పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్‌గూడ, గొల్లపల్లి, కిషన్‌గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
నవంబర్ 1న..
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు.. బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్ జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్‌పాస్, గగన్‌పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
నవంబర్ 2న..
బాలానగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. బోయిన్పల్లి నుంచి బాలానగర్వైపు వెళ్లే వాహనాలు బోయిన్పల్లి జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతంనగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. బాలానగర్ నుంచి బోయిన్పల్లి వైపు వెళ్లే వాహనాలు సైతం ఇదే రూట్లో వెళ్లాలి. బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వెహికల్స్ బాలానగర్ టీ–జంక్షన్ నుంచి ఫతేనగర్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా కూకట్పల్లి వై జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. బోయిన్పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వైపు వచ్చే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కూకట్పల్లి నుంచి బోయిన్పల్లి వైపు వెళ్లే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాలి.
కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో.. బాలానగర్ నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్ ఒకే లేన్‌లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు. కూకట్పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను రెండు లేన్లలో అనుమతిస్తారు. జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్‌ను ఒకే లేన్‌లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర ఉంటుంది. వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

