హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా నేడు నందినగర్‌లోని తన నివాసానికి రానున్నారు. సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలో విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
బంజారాహిల్స్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలనిఅధికారులు సూచించారు.