హైదరాబాద్ : సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వేలైన్ రాజేంద్రనగర్ శాస్త్రిపురం వద్ద త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఆర్ఓబీ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు (మొత్తం 180 రోజుల పాటు) సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ మళ్లించడంతో పాటు ఆంక్షలు విధించారు. ఈ పనుల కారణంగా వట్టేపల్లి – మెహముదా హోటల్ – మెహఫిల్ హోటల్ – మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులు పనులకు ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
-మైలార్‌దేవ్‌పల్లి-అరాంఘర్ క్రాస్ రోడ్డు-శాస్త్రిపురం మెయిన్ రోడ్డు-వట్టేపల్లి రోడ్డు.
-వట్టేపల్లి రోడ్డు- శాస్త్రిపురం రోడ్డు- శివరాంపల్లి రైల్వే రోడ్డు-మైలార్‌దేవ్‌పల్లి.
-వట్టేపల్లి రోడ్డు- ఇంజిన్ బౌలీ క్రాస్ రోడ్డు- ఫలక్‌నుమా రోడ్డు – చాంద్రాయణగుట్ట- మైలార్‌దేవ్‌పల్లి.
-మైలార్‌దేవ్‌పల్లి- అరాంఘర్ క్రాస్ రోడ్డు-శాస్త్రిపురం ప్రధాన రోడ్డు- తాడ్బన్ జంక్షన్- కాలాపత్తర్ రోడ్డు- శంషీర్‌గంజ్ జంక్షన్ -ఇంజిన్ బౌలీ క్రాస్ రోడ్డు – వట్టేపల్లి రోడ్డు.