హైదరాబాద్ : మొహరం ( Moharram ) సందర్భంగా బుధవారం నిర్వహించే బీబీకా అలామ్ ఊరేగింపు నేపధ్యంలో ఓల్డ్‌సిటీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల ట్రాఫిక్ ఆంక్షలుంటాయని (Traffic restrictions ) నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులను(RTC Bus) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రంగమహాల్, అఫ్జల్‌గంజ్ వైపు నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుందని వివరించారు. కాలికబర్, మిరాలం మండి రూట్లలో ఊరేగింపు చేరుకునే వరకు అనుమతి ఉంటుందన్నారు. సికింద్రాబాద్ (Secundrabad) ప్రాంతంలో- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్‌లోకి ట్యాంక్‌బండ్ మీద నుంచి కర్బాల మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ నుంచి కవాడిగూడ(Kavadiguda) , బైబిల్ హౌస్, ఆర్పీ రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు.
ఆర్పీ రోడ్డు నుంచి కర్బాల మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలను బైబిల్ హౌస్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్స్, డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ వైపు వెళ్లాలని తెలిపారు. ఎంజీ రోడ్డులో సెంట్రల్ టెలిగ్రాప్ ఐలాండ్, రాణిగంజ్ రూట్లో వన్ వే ఉంటుందని, రాణిగంజ్ వద్ద ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్డులో అవసరమైతే మళ్లిస్తామని అదనపు సీపీ వివరించారు.