TG DGP | తెలంగాణ పోలీసులకు డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు..!
TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగళవారం కార్యాలయంలో డీజీపీ సమావేశమయ్యారు.
TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగళవారం కార్యాలయంలో డీజీపీ సమావేశమయ్యారు. ఆయా జిల్లాలు, కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి చెందుతారన్నారు. పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించారు.
పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పారు. తాను సైతం త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని తెలిపారు. తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని పేర్కొన్నారు. హిస్టరీ షీట్ల సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీఎం దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్, హైదరాబాద్ సీపీ కే శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీపీలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

