స్వయంగా తొలగించుకోండి
ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 177ని ఉల్లంఘించడమేనని వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని గుర్తించి, ఆయా వాహనాలపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించుకోవాలని సూచించారు.