Traffic | మణికొండ, జనవరి 6 : ఉదయం మొదలు…రాత్రి పన్నెండు గంటల వరకు మణికొండ, నార్సింగి పట్టణ కేంద్రాలల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నచిన్న వ్యాపారాలు ఫుట్‌పాత్‌లపై నిర్వహిస్తుండటంతో అక్కడకు వచ్చే వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను పార్కింగి చేయాల్సి వస్తోంది.
ఫలితంగా రోడ్డుపై వెళ్లే వారికి నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరిగి అస్తవ్యస్థంగా ప్రధాన కూడళ్లు తయారయ్యాయి. ప్రధానంగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిచెట్టు సర్కిల్, ఆర్టీఏ కార్యాలయం వెళ్లే రహదారి, ఆంధ్రాబ్యాంకు సర్కిల్, అలిజాపూర్ చింతచెట్టు సర్కిల్, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో నార్సింగి టీ జంక్షన్, వైయస్సార్ జంక్షన్, సబ్ రిజిస్టార్ కార్యాలయ సర్కిల్‌ల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.