హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. సచివాలయం వైపు వాహనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వాహనాలు స్లోగా నడుస్తున్నాయి.
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంజే మార్కెట్లోని ఒకర్యాలీలో పాల్గొంటారని, దానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తూ భద్రతను పెంచామని వెల్లడించారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి తన పర్యటన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎంపీలతో సమావేశాల కారణంగా పర్యటన రద్దయిందని బీజీపీ వర్గాలు వెల్లడించాయి.