హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పెద్దఅంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు (ORR) సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్‌ను బైకు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ (Traffic Constable) మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాన్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.