Miyapur | ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్ మృతి
మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మియాపూర్, ఏప్రిల్ 8: మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. నో ఎంట్రీ వాహనాలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో కూకట్పల్లి భరత్ నగర్లో బియ్యం బస్తాలను అన్లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో అది అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పడింది.

హోంగార్డు సింహాచలం తలకు తీవ్రమైన గాయం కాగా, రాజవర్ధన్ కుడి చెయ్యి భుజంలో ఫ్రాక్చర్ అయింది. విజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను వైద్యం నిమిత్తం మదీనాగూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు హాస్పటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. మిగిలిన ఇద్దరూ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్‌ను సదాశివపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. నిర్లక్ష్యం, అతి అతివేగం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

