ఎల్బీనగర్, జనవరి 20 : తుఫాన్ వాహనం అదుపుతప్పి మూడు ద్విచక్రవాహనాలు, ఓ కారును ఢీ కొట్టడంతో అవి ధ్వంసం కావడంతో పాటు పలువురికి గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం సంతోషిమాత సిగ్నల్ వద్ద అతి వేగంగా దూసుకువచ్చిన తూఫాన్ వాహనం ఆగి ఉన్న స్విఫ్ట్ కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పోరెడ్డి నరేందర్‌రెడ్డి, పోరెడ్డి సురేందర్‌రెడ్డి, సంగిశెట్టి కుమార్, రిచర్డ్ అంథోనిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.