Wine Shops | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ హోటల్స్, రిజిస్టార్ క్లబ్స్‌కు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపులున్నట్లు వెల్లడించారు.
సిటీ బ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో గురువారం మధ్యాహ్నం మియాపూర్, గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుమ్యులోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు.