ఎల్బీనగర్, అక్టోబర్ 26: ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీవాసులు, నిర్వాసితులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు మూసీ పరీవాహక ప్రాంతాల నిర్వాసితులతో ఎమ్మెల్యే సమావేశమవుతారని బీఆర్ఎస్ నాయకుడు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌నగర్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా ద్వారాకాపురం రోడ్ నం.8 మైదానంలో భవానీనగర్, ద్వారాకాపురం, గణేశ్పురి, ఇందిరానగర్ మూసీ నిర్వాసితులతో సమావేశం ఉంటుందన్నారు.