హైదరాబాద్: మరోసారి కుండపోతగా కురవడంతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) తడిసిముద్దయింది. సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మరోసారి దంచికొట్టింది. వేకువజామున ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది. దీంతో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక పంజాగుట్టలోని అపార్టుమెంట్ సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది (Lightning). షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
కాగా, ఎడతెరపిలేకుండా కురిసిన వర్షానికి మలక్‌పేట అజాంపుర వద్ద భారీగా వరద ప్రవాహిస్తున్నది. , దబీర్‌పురా వద్ద వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలా పొంగి నల్లగొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వే స్టేషన్ వరకు రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో మలక్‌పేట రైల్వే బ్రిడ్జి నుంచి కోఠీ, దిలుసుక్నగర్, సంతోష్‌నగర్ వైపు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
ఇక మరో రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో అవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తంచేశారు. ఏదైనా సమస్య వస్తే టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని సూచించారు.
Heavy in Hyderabad. The roads are flooded and people are facing of problems 🌨️🌨️🌨️🌨️#HyderabadRains #earthquake pic.twitter.com/u82iTtn7rt
— Vandana Meena (@vannumeena0) August 20, 2024