మణికొండ ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : పట్టపగలు ఓ మహిళ మెడలోంచి మంగళ సూత్రాన్ని అపహరించకపోయిన (Chain snatching)ఘటన నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు లేని వ్యక్తి మంగళసూత్రాన్ని అపహరించుకొని పరారైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 25 ఇంజినీయం స్కూల్ ముందు నడుచుకుంటూ వస్తున్న అడుసుమిల్లి వజ్రకుమారి సరుకులు తెచ్చుకోవడానికి పక్కనే ఉన్న రిలయన్స్ సూపర్ మార్కెట్కు వెళ్లింది. సరుకులు తీసుకొని తిరిగి వస్తుండగా వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఆవిడ మెడలోఉన్న సుమారు 5 తులాల పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. ఈ సంఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.