Banjarahills | బంజారాహిల్స్, మార్చి 21: రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటనలో ముగ్గురు యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటలోని ఎ టు జెడ్ టెంట్ హౌజ్‌లో పనిచేసే అల్లూరి మహేష్(21), ద్యానబోయిన కిషోర్ (21), దాసరి మహేష్(22) అనే యువకులు ఈనెల 14న రాత్రి మద్యం సేవించి బైక్ మీద బయటకు వచ్చారు.
ఇందిరా నగర్ ప్రాంతంలో ట్రాన్స్జెండర్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. రోడ్డుమీద ఉన్న ట్రాన్స్ జెండర్‌తో పొదల్లోకి వెళ్లేందుకు వెళ్తున్న షేక్ రఫీ అనే వ్యక్తిని అటకాయించి దాడి చేసి అతడి వద్ద నుంచి రూ.12 వేల నగదు దోచుకున్నారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ సహాయంతో నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.