బండ్లగూడ, జూన్ 25: కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీలో నివాసముండే శ్యామలమ్మ రిచ్మండ్ విల్లాలోని ఓ ఇంట్లో పని చేస్తున్నది.
మంగళవారం వారి ఇంట్లో మిగిలిన ఆహారాన్ని ఇంటికి తీసుకొచ్చిన శ్యామలమ్మ.. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసింది. గంట తర్వాత ఇద్దరు కూతుళ్లు వాంతులు చేసుకోవడంతో వారిని దవాఖానకు తరలించారు. వారిలో భువనేశ్వరి(3) గురువారం చికిత్స పొందుతూ చనిపోగా, మరో కూతురిని నిలోఫర్‌కు తీసుకెళ్లారు. శ్యామలమ్మతో పాటు ముగ్గురు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.