సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ కమిషనరేట్‌లో ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరం డీసీపీ సునీత వనపర్తి జిల్లా ఎస్పీగా, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి మహేశ్వరం డీసీపీగా బదిలీ అయ్యారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు బదిలీ చేశారు.
రాచకొండ, భువనగిరి ఎస్డీపీఓ కనకాల రాహుల్‌రెడ్డి అదనపు ఎస్పీ గ్రేడ్-1గా భువనగిరిలోనే పోస్టింగ్ ఇచ్చారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీ అరవింద్‌బాబును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న గుణశేఖర్‌ను నియమించారు.