సిద్దిపేట : మూడు నెలల్లోనే 59 ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన(Bikes stealing) నిందితులను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయికుమార్ జగదీష్,హరికృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ద్విచక్రాకల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన బైకులు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వాహనాలను కొంటున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.47లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం